ఆపరేషన్ సిందూర్ నిలిపివేతపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

  • ఆపరేషన్ సిందూర్ నిలిపివేత భారత్ సొంత నిర్ణయమని వెల్లడి
  • అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్న రాజ్‌నాథ్ సింగ్
  • ఆపరేషన్ నిలిపివేయడం వెనుక వ్యూహం ఉందన్న కేంద్రమంత్రి
ఆపరేషన్ సిందూర్ నిలిపివేతపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను భారత్ తన సొంత నిర్ణయం మేరకే నిలిపివేసిందని ఆయన అన్నారు. కానీ అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఏఎన్ఐ నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో ఆయన మాట్లాడారు.

ఆపరేషన్ సిందూర్ నిలిపివేత వ్యూహాత్మక నిర్ణయమేనని అన్నారు. కానీ సామర్థ్యం లేక నిలిపివేయలేదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ మన సాయుధ దళాల సమైక్యతకు ఒక ఉదాహరణ అన్నారు. మన త్రివిధ దళాలు సమన్వయంతో ముందుకు వెళ్లాయని ప్రశంసించారు. సొంత నిబంధనలు, నిర్ణయం ప్రకారమే సరైన సమయంలో దానిని ముగించామని తెలిపారు. ఇది మనం స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని పునరుద్ఘాటించారు.

పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రబిందువు అని రాజ్‌నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదం కేవలం దేశ వ్యతిరేక చర్య మాత్రమే కాదని, దానికి బహుముఖ కోణాలు ఉన్నాయని అన్నారు. దానిని కూకటివేళ్లతో పెకలించాలని ఆయన పిలుపునిచ్చారు. పాకిస్థాన్ అనునిత్యం ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రమైతే పాకిస్థాన్ మాత్రం తీవ్రవాదానికి కేంద్రబిందువు అని రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Stopped Op Sindoor Voluntarily
Ready For Long War
Rajnath Singh Calls Pakistan Terror Epicentre
Rajnath Singh on Op Sindoor

More Telugu News